10
అక్షరటుడే, ముప్కాల్: Mupkal | ముప్కాల్ మండల కేంద్రంలో (Mupkal mandal center) శాఖాహారంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పీఎస్ఎస్ఎం (పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీఎస్ మూమెంట్) నవనాథపురం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ర్యాలీ ప్రారంభించారు.
రిటైర్డ్ ఉపాధ్యాయుడు జనాభాయ్ ర్యాలీని ప్రారంభించి ప్రజల్లో శాఖాహారం (Vegetarian) ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా ‘శాఖాహారం – ఆరోగ్యానికి ఆధారం’ అంటూ నినాదాలు చేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన పెంపొందుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామస్థులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.