HomeతెలంగాణNizamabad Additional Collector | డ్రగ్స్ నిరోధానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి

Nizamabad Additional Collector | డ్రగ్స్ నిరోధానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Additional Collector | మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar) అన్నారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో బుధవారం వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే చేపట్టిన అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో విస్తృతంగా వివరించాలన్నారు. నిజామాబాద్ జోన్ డీఎస్పీ సోమనాథం మాట్లాడుతూ.. ఇటీవల సుమారు రూ.42.98 కోట్ల విలువ చేసే అల్ప్రాజోలం నిల్వలను సీజ్ చేశామని, మహారాష్ట్రలోని వాటి మూలాలపై సైతం దాడులు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయి, అల్ఫ్రాజోలం, డైజోఫామ్, ఫ్లోరల్ హైడ్రేట్, తదితర మత్తు పదార్థాలు రవాణా, విక్రయాలు చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ (toll-free number) 1908 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.