4
అక్షరటుడే, ఆర్మూర్:Kotapati Narasimha Naidu | వ్యవసాయంలో కొత్త వంగడాలు, ఎరువుల వాడకంపై జయశంకర్ వర్సిటీ సలహామండలి సభ్యుడు కోటపాటి నరసింహానాయుడు kotapati narsimha naidu రైతులకు వివరించారు. గురువారం ముప్కాల్ మండలం కొత్తపల్లి గ్రామంలో ‘రైతుల వద్దకే శాస్త్రవేత్తలు’ (Scientists at the Farmers Side) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
నూతన వంగడాలు, పురుగు మందులు, రసాయన ఎరువుల వాడకంలో మెలకువలు, పంటల మార్పిడిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా. ఫిర్దోస్ సహనా, కల్పన, మండల ఏఈవో రుద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ వినాయక్, హరీష్ కుమార్, రుద్రూర్ కృషి విజ్ఞాన్ కేంద్రం వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.