అక్షర టుడే, వెబ్‌డెస్క్: Traffic Rules | నగరంలో ట్రాఫిక్ పోలీసుల (traffic police) ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ ప్రసాద్ మాట్లాడుతూ.. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు స్థానిక కోర్టు చౌరస్తా వద్ద ఈ మేరకు అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఇందులో భాగంగా ట్రాఫిక్ నియమాలు (traffic rules), ట్రాఫిక్ సిగ్నల్స్, వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై వివరించారు. రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ వద్దే దాటాలని, వాహనదారులు సైతం క్రాసింగ్ లైన్ దాటవద్దని సూచించారు. అలాగే మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ డ్రైవింగ్, సీట్ బెల్టు విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వందన స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.