అక్షరటుడే, కోటగిరి: Kotagiri Mandal | మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో రుద్రూర్ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఈ తోట రాజశేఖర్ మాట్లాడుతూ.. విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దీపావళి పండుగ సందర్భంగా ఇళ్లు, దుకాణాల్లో సిరీస్ లైట్ల వినియోగం సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడవద్దని, అతుకులు ఉన్న విద్యుత్ వైర్లను చేతితో తాకవద్దని, ఇతర జాగ్రత్త చర్యలు పాటించాలన్నారు.
విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని, నాణ్యమైన ఐఎస్‌ఐ కేబుల్, ఎలక్ట్రిక్ వస్తువులనే వాడాలని సూచించారు. విద్యుత్ సమస్యలుంటే 1912 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో పోతంగల్ ఏఈ బుజ్జి బాబు, పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస రావు, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు సాయిలు, విద్యుత్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.