అక్షరటుడే, డోంగ్లి: Dongli Mandal | డోంగ్లి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో (Anganwadi Center) శుక్రవారం పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉపాధ్యాయురాలు పూజ మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ (Anganwadi Center) కోసం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందిస్తున్నామన్నారు.
బాలింతలు, పిల్లలకు పోషకాహారంతో ఉపయోగాలపై అవగాహన కల్పించారు. ప్రతిఇంటికి వెళ్లి పౌష్టికాహారం, తాగునీరు, పచ్చదనం పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.