అక్షర టుడే, ఆర్మూర్: Aloor Mandal | ఆలూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ (police department) ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగంతో నష్టాలు, నివారణపై అవగాహన కల్పించారు. యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వ్యసనాన్ని (drug addiction) అరికట్టేందుకు, విద్యార్థుల్లో చైతన్యం కోసం వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
యువతలో మాదకద్రవ్యాల వాడకం సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారిందని, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వాడకంతో శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా కుటుంబాలు, భవిష్యత్తు కూడా నాశనం అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ నరేందర్, ఏఎస్సై ఓకే సుశీల్ కుమార్, ప్రశాంత్ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.