అక్షరటుడే, ఇందూరు: CPR | నగరంలోని తెలంగాణ అమర వీరుల పార్క్‌లో (Telanagana amaraveerula park) గురువారం సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య శాఖ (Union Health Ministry) ఆదేశాల మేరకు వాకర్స్ అసోసియేషన్ (Walkers Association) సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు సీనియర్ వైద్యుడు టి అరవింద్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసరం సమయంలో మనిషిని కాపాడేందుకు చేయాల్సిన అందించాల్సి సేవలపై అవగాహన కల్పించారు. అలాగే ప్రత్యక్షంగా సీపీఆర్ చేసి చూపించారు. ప్రతి ఒక్కరూ సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఈ రోజుల్లో మనిషి జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయని.. హార్ట్ఎటాక్లు కూడా పెరిగాయన్నారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆయుష్ పురుషోత్తం, పంతులు, ఒడ్డెన్న, భూమన్న, సుభాష్, కిషన్, సాయాగౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.