అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Medicover Hospital | మహిళలకు సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన అవసరమని మెడికవర్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ గ్రీష్మిక (gynecologist Dr. Greeshmika) అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆస్పత్రిలో ‘సర్వైకల్ మంత్’ (Cervical Month) సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల్లో ఎక్కువగా కనిపించే ప్రధాన క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ (cervical cancer) ఒకటన్నారు. దీనిపై సరైన అవగాహనతో పాటు ముందస్తు పరీక్షలు చేయించుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని ఆమె సూచించారు.
Medicover Hospital | 30ఏళ్ల పైబడిన మహిళలు..
30 సంవత్సరాల పైబడిన వయస్సు ఉన్న ప్రతి మహిళ క్రమం తప్పకుండా పాప్ స్మియర్ టెస్ట్, హెచ్‌పీవీ (HPV) స్క్రీనింగ్ వంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రారంభ దశలో ఈ వ్యాధిని గుర్తిస్తే పూర్తిగా చికిత్స సాధ్యమవుతుందని ఆమె వెల్లడించారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, హెచ్‌పీవీ HPV వైరస్ సంక్రమణ, వ్యక్తిగత పరిశుభ్రత లోపం, పొగతాగడం వంటి కారణాల వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యురాలు గ్రీష్మిక వివరించారు. అలాగే హెచ్‌పీవీ (HPV) వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. నగరంలోని మెడికవర్ హాస్పిటల్లో మహిళల ఆరోగ్య సంరక్షణకు అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్యుల సేవలందిస్తూ ఎప్పుడూ ముందుంటుందని నిర్వాహకులు తెలిపారు.
Medicover Hospital | ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు..
మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఎలాంటి లక్షణాలు లేకపోయినా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యురాలు సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ సెంటర్ హెడ్ కె.స్వామి, డీఎంఎస్ డాక్టర్ యజ్ఞ, మార్కెటింగ్ హెడ్ వినయ్ పాల్గొన్నారు.