అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : PCC Chief | బీసీలలో ఐక్యత, చైతన్యం రావాలని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కలిసి ఉంటేనే అధికారాన్ని సాధించుకోవచ్చని పేర్కొన్నారు.
నిజామాబాద్ (Nizamabad) నగరంలోని వినాయక్ నగర్లో ఏర్పాటు చేసిన జ్యోతిబాపూలే విగ్రహాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జ్యోతిబా పూలే 1931లో అప్పటి జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. మహిళల్లో చైతన్యం తెచ్చి చదువుకుని అన్ని రంగాల్లో ముందు ఉండడానికి అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. జ్యోతిబాపూలే మొట్టమొదటి మహిళా టీచర్ కావడం గర్హించదగ్గ విషయమన్నారు.
PCC Chief | యువత చరిత్ర తెలుసుకోవాలి
నేటి తరం యువతకు చరిత్ర తెలియడం లేదని మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. వారు చరిత్రను చదవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. బీసీలంతా ఒక్కటిగా ఉంటేనే విజయాలు సాధించవచ్చన్నారు. కులాభిమానం ఉండాలి తప్ప కుల పిచ్చి ఉండకూడదన్నారు.
PCC Chief | దేశంలో ఎక్కడా లేని విధంగా కుల గణన
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ దేశంలో ఎవరూ చేయని సాహసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే(CM Revanth Reddy) శారు. కుల గణన చేపట్టి చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch Elections) బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలు కలిసి 86 శాతం గెలుపొంది ఐక్యతను చాటారన్నారు. పార్టీ పరంగా బీసీలకు తగినన్ని సీట్లు ఇచ్చి గెలిపించుకోగలిగామన్నారు.
PCC Chief | బీసీలకు అత్యధిక నిధులు కేటాయించాలి
నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక శాతం బీసీలు, మహిళలు ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో బీసీలకు అత్యధిక నిధులు కేటాయించాలని కోరారు. 42 శాతం బీసీ రిజర్వేషన్‌కు అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పూర్తి మద్దతును ప్రకటించామన్నారు. రిజర్వేషన్లు రాజ్యాంగ పద్ధతిలో ఉంటే కేంద్ర ప్రభుత్వం (Central Government) తప్పకుండా మద్దతును తెలియజేస్తుందన్నారు.
కార్యక్రమంలో బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, కో–ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, ఆకుల లలిత, అంతిరెడ్డి రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నుడా ఛైర్మన్ కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.
