అక్షర టుడే, బాల్కొండ: Mupkal Mandal | ముప్కాల్ మండలకేంద్రంలో గురువారం బాల్య వివాహాల (child marriages) నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంపీడీవో బి రమేష్, ఎస్సై రజనీకాంత్, తహసీల్దార్ ముంతాజుఉద్దీన్ హాజరై మాట్లాడారు.
బాల్య వివాహ నిరోధక చట్టం–2006 (Child Marriage Prevention Act-2006) ప్రకారం 18 ఏళ్లు నిండని ఆడపిల్లలకు, 21 ఏళ్లు నిండని పురుషులకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. చిన్న వయసులో పిల్లలకు వివాహం చేయడంతో మాతా–శిశు మరణాలు, పోషకాహార లోపం, పిల్లల ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయని వివరించారు. వివాహ వయసు వచ్చిన తర్వాతే పిల్లలకు వివాహం చేయాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా ఉంటుందని హెచ్చరించారు.

