అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు (Municipal Commissioner Raju) ఉత్తమ సేవలకు గాను అవార్డు లభించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో (Police Parade Ground) వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ (BC Commission Chairman Niranjan) విచ్చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజుకు అవార్డును అందజేశారు. కమిషనర్‌కు అవార్డు రావడంపై ఆర్మూర్ మున్సిపల్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.