ePaper
More
    HomeసినిమాAvika Gor | ప్రియుడితో నిశ్చితార్థం జ‌రుపుకున్న ‘చిన్నారి పెళ్లి కూతురు’.. పెళ్లెప్పుడంటే..!

    Avika Gor | ప్రియుడితో నిశ్చితార్థం జ‌రుపుకున్న ‘చిన్నారి పెళ్లి కూతురు’.. పెళ్లెప్పుడంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Avika Gor | తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిన్నారి పెళ్లి కూతురిగా ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ అవికా గోర్(Avika Gor). సీరియ‌ల్‌లో ఆనందిగా అందరి మనసుల్ని దోచుకుంది అవికా గోర్. చిన్నారి పెళ్లికూతురు సీరియల్​తో ప్రతి తెలుగింటికి పరిచయం అయిన నటి అవికా గోర్ ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమా(Uyyala Jampala movie)తో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా మంచి హిట్ కావ‌డంతో ఈ భామ‌కి అవ‌కాశాలు బాగానే వ‌చ్చాయి. ఈ సినిమా త‌ర్వాత సినిమా చూపిస్త మామ, వధువు, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవల అవికా గోర్​కు ఆఫర్స్ తగ్గాయి. కాగా.. అవికా గోర్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలకబోతోంది.

    Avika Gor | గ్రాండ్‌గా నిశ్చితార్థం..

    చాలా కాలంగా ప్రేమలో ఉన్న అవికా.. తాజాగా తన ప్రియుడు మిలింద్ చంద్వానితో(milind chandwani) నిశ్చితార్థం చేసుకుంది. జూన్ 11, 2025న ఆమె ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా తన నిశ్చితార్థాన్ని ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. అతడు ప్రేమ అడిగాడు. నేను భావోద్వేగానికి లోనయ్యాను. ఓకే చెప్పాను. అతడు మనసులో మాట చెబుతున్నప్పుడు నేను మూవీ లవర్​గా మారిపోయా. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్లో-మోషన్ డ్రీమ్స్ కనిపించాయి. అతను లాజిక్​గా, ప్రశాంతంగా ఉన్నాడు. అతను అడిగినప్పుడు నా కళ్లలో కన్నీళ్లు తిరిగాయి’ అంటూ అవికా గోర్ ఎమోషనల్ పోస్టు చేశారు. కాగా, అవికా గోర్​ను పెళ్లి చేసుకోబోయే మిలింద్ చాంద్వానీ ఒక సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్(Social media influencer).

    ఆయన ఐఐఎం అహ్మదాబాద్​లో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం క్యాంప్‌ డైరీస్‌(Camp Diaries NGO) అనే ఓ ఎన్జీవో నిర్వహిస్తున్నారు. అయితే 2019లో క్యాంప్ డైరీస్ ద్వారా అవికా గోర్, మిలింద్ మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ రిలేషన్​లో ఉన్నట్లు సమాచారం. అవికా గోర్, మిలింద్ చంద్వానీ హైదరాబాద్‌లో కొంతకాలం క్రితం కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నారు. ఆ పరిచయం నెమ్మదిగా బలమైన బంధంగా మారింది. ఒక ఇంటర్వ్యూలో అవికా మాట్లాడుతూ మొదట మేం స్నేహితులుగా ఉన్నాం.. ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారింది అని పేర్కొంది. మిలింద్ గతంలో ఎంటీవీ రోడీస్ షోలో కంటెస్టెంట్​గా పాల్గొన్నాడు. ఆ తర్వాత సోషల్ యాక్టివిస్ట్​గా మారాడు. అయితే నిశ్చితార్థం Engagement చేసుకున్న ఈ జంట త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నారు.

    More like this

    Crop Damage | నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుంది

    అక్షరటుడే, డోంగ్లి: Crop Damage | ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలో 3,200 ఎకరాల్లో పంట...

    Movements and Protests | రెండు దేశాలు.. రెండు ఉద్యమాలు.. ప్రభుత్వాలను కూల్చేసిన నిరసనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movements and Protests | రెండు దేశాల్లో రగిలిన రెండు ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను...

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...