అక్షరటుడే, ఎల్లారెడ్డి: RTA Yellareddy | నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆటోలను సీజ్ చేసినట్లు ఏఎంవీఐలు శంకర్, ఉదయ్, ఈర్షద్, రఫీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలో (Yellareddy town) తనిఖీలు నిర్వహించారు.
RTA Yellareddy | జిల్లా రవాణా శాఖాధికారి సూచనల మేరకు..
జిల్లా రవాణా శాఖాధికారి (District Transport Officer) సూచనల మేరకు మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టామని ఏఎంవీఐలు పేర్కొన్నారు. ఆటోరిక్షాలు, మినీ క్యాబ్లను తనిఖీ చేసి పత్రాలను పరిశీలించామని వెల్లడించారు. బాన్సువాడ, పిట్లం, తాడ్వాయి, కామారెడ్డి ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఏడు వాహనాలను సీజ్ చేసినట్లు వారు తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థుల భద్రత అందరి బాధ్యత అని వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపే సమయంలో వారు సురక్షితమైన వాహనాల్లో ప్రయాణిస్తున్నారా లేదా అనే విషయాన్ని తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. అలాగే రహదారి భద్రతా నియమాలు పాటించేలా రవాణా శాఖకు (transport department) పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.