ePaper
More
    HomeతెలంగాణSSR Degree College | ఎస్ఎస్ఆర్​కు అటానమస్ హోదా

    SSR Degree College | ఎస్ఎస్ఆర్​కు అటానమస్ హోదా

    Published on

    అక్షరటుడే, ఇందూరు: SSR Degree College | ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలకు యూజీసీ నుంచి స్వయం ప్రతిపత్తి హోదా లభించినట్లు కళాశాల ఛైర్మన్ మారయ్య గౌడ్ (ssr College Chairman Maraiah Goud) తెలిపారు. శనివారం ఖలీల్​వాడిలోని కళాశాల ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో 33 ఏళ్లుగా అనేకమంది ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత తమ విద్యా సంస్థకు దక్కుతుందన్నారు. మూడు దశాబ్దాల క్రితం గిరిరాజ్ కళాశాల (Giriraj College) మినహా ప్రైవేటు కళాశాలలు (Private colleges) లేని సమయంలో తాము కళాశాలను నెలకొల్పి విద్యనందించామని గుర్తు చేశారు.

    యూజీసీ (UGC) నుంచి అటానమస్ (Autonomous) హోదా కల్పించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డిగ్రీలో ఎంటీ, ఏఐ కోర్సులు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. అలాగే విద్యాసంస్థల డైరెక్టర్​గా తన కుమారుడు హర్షిత్ గౌడ్​ ssr colllege director Harshit goud పేరును ప్రకటించారు. సమావేశంలో హరిత గౌడ్ పాల్గొన్నారు.

    More like this

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 12,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...