Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | నగరంలో వ్యాపారి పరార్​..!

Nizamabad City | నగరంలో వ్యాపారి పరార్​..!

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad City | నగరంలోని ఓ ఆటో మొబైల్​ వ్యాపారి డబ్బులతో ఉడాయించిన ఘటన కలకలం రేపింది.

నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్​లో(Auto nagar) ఓ వ్యాపారి పరారైనట్లు బాధితులు తెలిపారు. స్థానికంగా ఆటోమొబైల్​ దుకాణం (Automobile shop) నడిపే సదరు వ్యాపారి నాలుగు రోజులుగా కనబడడం లేదని తెలిసింది. అయితే సదరు వ్యాపారి రూ.70 లక్షల వరకు పలువురి వద్ద అప్పులు చేసి పరారైనట్లు పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. కానీ, అంతకుమించి కుచ్చుటోపీ పెట్టినట్లు తెలుస్తోంది. సుమారు 20 మంది నుంచి రూ. 70 లక్షలకు పైగా వసూలు చేసినట్లు బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిసింది. దీంతో అతడి కోసం పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. కాగా.. అతడు మహారాష్ట్రలో ఉన్నట్లు సమాచారం.