ePaper
More
    Homeక్రైంYellareddy | ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

    Yellareddy | ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి:Yellareddy | ఆటో, మోపెడ్ వాహనాలు ఢీకొన్న ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు. ఎల్లారెడ్డి నుంచి రుద్రారం వైపు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ ఆటోను టీవీఎస్ మోపెడ్ (TVS moped) వాహనం ఢీకొంది.

    ఈ క్రమంలో ఆటో(Auto) బోల్తా పడగా, అందులో ప్రయాణిస్తున్న ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన షేర్ల చంద్రయ్య, శకుంతల, లక్ష్మి, బ్రాహ్మణపల్లికి చెందిన గంగవ్వ, నిజాంసాగర్ మండలంలోని బంజపల్లికి చెందిన రజిత, సుమలత, చిన్నారి అభినయకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రి(Government hospital)కి తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న మున్సిపల్ మాజీ ఛైర్మన్ సత్యనారాయణ (Former municipal chairman Satyanarayana) ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్‌ను కలిసి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...