అక్షరటుడే, నిజాంసాగర్:Auto Drivers Rally | హైదరాబాద్(Hyderabad)లో వచ్చేనెల 27న నిర్వహించనున్న ‘ఆటో ఆకలి కేకలు’ మహాసభను సక్సెస్ చేయాలని రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ అధ్యక్షుడు మంద రవికుమార్(Manda Ravikumar) పిలుపునిచ్చారు. నిజాంసాగర్‌లో శనివారం ఆటో రథయాత్ర(Auto Rath Yatra) నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈనెల 25న మెదక్‌లోని నర్సాపూర్ నుంచి రథయాత్ర ప్రారంభమైందని.. 27న హైదరాబాద్ చేరుకుంటుందన్నారు. అదేరోజు ఇందిరా పార్క్‌లో అమరవీరుల ప్రాంగణం వద్ద మహాసభ ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme)తో ఆటోవాలాలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఆటోడ్రైవర్లు(Auto Drivers) ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు. మృతిచెందిన ఆటో డ్రైవర్లకు రూ. 25 లక్షలు నష్టపరిహారం(Compensation) ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సాయిలు, నిజాంసాగర్ మండల ఆటో యూనియన్ సభ్యులు కైసర్ కుర్షిద్, నర్సింలు, సతీష్, హమీద్, మక్సూద్, రఫీక్, రజాక్‌తో పాటు పలువురు ఆటోడ్రైవర్లు యూనియన్ సభ్యులు ఉన్నారు.