అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: auto drivers robberies | ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకొని శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి దోచుకుంటున్న ముఠాను నిజామాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో సోమవారం వివరాలు వెల్లడించారు.
auto drivers robberies | ఒంటరిగా వెళ్లేవారే టార్గెట్..
నగరంలో ఆటోల్లో ఒంటరిగా వెళ్లే ప్రయాణికులను ఎక్కించుకొని వారిని శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి దోచుకుంటున్న ఘటనలపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా పోలీసులు నిఘా పెట్టి, సాంకేతిక పరిజ్ఞానంతో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వీరు బస్టాండ్, మాలపల్లి, ఖలీల్‌వాడి, ఆర్యనగర్ ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్న ప్రయాణికులను ఎక్కించుకుని మాటల్లో పెట్టి శివారు ప్రాంతాలకు తీసుకెళ్తారు. అనంతరం వారిపై దాడి చేసి మొబైల్ ఫోన్లు, పర్సులు, బంగారం లాక్కొని కొట్టి పారిపోతారు.
ఇలా ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్న నిందితులు ఆటోనగర్‌కు చెందిన షేక్ సద్దాం, షేక్ నయీం, నెహ్రూనగర్‌కు చెందిన షేక్ ఇమ్రాన్, ఎల్లమ్మ గుట్టకు చెందిన సయ్యద్ వసీం పాషా, అహ్మద్‌పురా కాలనీకి చెందిన సయ్యద్‌ను ఒకటో ఠాణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో వివరించారు.