అక్షరటుడే, డిచ్పల్లి: Auto Collision | ఆటో అతివేగానికి ఓ నిండుప్రాణం బలైంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో గురువారం (అక్టోబరు 23) రాత్రి చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్పల్లి నుంచి ధర్పల్లి (Dharpally) మండలం రామడుగుకు (Ramadugu) ఆటోలో ఆరుగురు వ్యక్తులు బయలుదేరారు.
Auto Collision | అతి వేగమే కారణం..
అయితే డ్రైవరు తలారి గంగాధర్ అతివేగంగా ఆటోను నడుపుతూ.. సుద్దపల్లి శివారులో సాంపల్లి గ్రామస్థుడైన అంతరెడ్డి గంగారెడ్డి(60)ని ఢీకొట్టాడు.
దీంతో గంగారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో సైతం బోల్తా పడింది. దీంతో డ్రైవరుతో సహా ఆరుగురికి గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
