అక్షరటుడే, వెబ్‌డెస్క్: Australia women beat India| మహిళల వన్డే ప్రపంచకప్ 2025 (ODI World Cup 2025) ప్రారంభానికి ముందు టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది.
స్వదేశంలో జరిగిన కీలక మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా Australia మహిళల జట్టు 2-1తో గెలుచుకొని మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటింది.
ఢిల్లీ Delhi లో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ, చివర్లో వరుస వికెట్లు కోల్పోవడంతో 43 పరుగుల తేడాతో ఓటమి పాలవడం బాధ కలిగించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 412 పరుగుల భారీ స్కోరు చేసి టీమిండియాపై ఒత్తిడిని పెంచింది.
బెత్ మూనీ 75 బంతుల్లో 23 ఫోర్లు, సిక్స్‌తో 138 పరుగులు చేసి రాణించగా,జార్జియో వోల్ (81), ఎలిస్ పెర్రీ (68) కూడా అద్భుత హాఫ్ సెంచరీలు సాధించారు.
Australia women beat India | స్మృతి సెంచరీ వృథా
భారత బౌలర్లలో indian Bowlers అరుంధతి రెడ్డి 3 వికెట్లు తీసి ఆకట్టుకోగా, దీప్తి శర్మ, రేణుకా సింగ్ చెరో 2 వికెట్లు, క్రాంతి గౌడ్, స్నేహ్ రానా చెరో వికెట్ తీశారు. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది.
స్మృతి మంధాన 63 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 125 పరుగుల విధ్వంసకర శతకంతో మ్యాచ్ ఉత్కంఠగా మారేలా చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (52), దీప్తి శర్మ 58 బంతుల్లో 72 పరుగులు చేసి స్మృతికి మద్దతు అందించారు.
కానీ కీలక సమయంలో దీప్తి శర్మ ఔట్ కావడం టీమిండియా Team India గెలుపు పైన నీరు చల్లినట్టు అయింది. తహిలా మెక్‌గ్రాత్ దెబ్బతో భారత్ తిరిగి నిలబడలేకపోయింది.
ఆసీస్ బౌలర్లలో కిమ్ గార్త్ (3/69) మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పగా, మేగన్ స్కట్ (2/53) ఆకట్టుకుంది. గార్డెనర్, మెక్‌గ్రాత్, గ్రేస్ హ్యారిస్, జార్జియో వేర్‌హమ్‌లు తలో వికెట్ సాధించారు.
ఈ ఓటమితో టీమిండియా వన్డే సిరీస్‌ను కోల్పోయినా, భారీ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉందని ప్రూవ్ చేసింది. అయితే లక్ష్యాన్ని ఛేదించలేక 369 పరుగుల దగ్గర ఆలౌటవడం మరోసారి ఒత్తిడిలో భారత్ తడబడినట్లు స్పష్టం చేస్తోంది.
2025 మహిళల వన్డే వరల్డ్‌కప్ సెప్టెంబరు 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి భారత్ – శ్రీలంక Srilanka సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా టైటిల్ ఆశలతో బరిలోకి దిగనుంది.
ఈ సిరీస్‌లోని అనుభవాలు, లోపాలను అధిగమించి వరల్డ్‌కప్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. కాగా, తాజాగా జరిగిన మ్యాచ్‌లో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలానే ఉద్దేశంతో టీమిండియా జట్టు పింక్ కలర్ జెర్సీతో బరిలోకి దిగింది.