అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Australia terror attack | ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ (Bondi Beach)లో ఇటీవల కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. 40 మంది వరకు గాయపడ్డారు. అయితే ఈ కాల్పులకు పాల్పడిన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వాడని తేలింది.
సిడ్నీ (Sydney) బాండి బీచ్‌లో డిసెంబర్ 14న ఉగ్రదాడి జరిగింది. హనుక్కా (Hanukkah) ఉత్సవాలు జరుపుకుంటున్న యూదులపై తండ్రీకొడుకైలన ఇద్దరు నిందితులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆస్ట్రేలియాలో విషాదం అలుముకుంది. అయితే కాల్పులకు పాల్పడింది సాజిద్ అక్రమ్ (50), అతడి కుమారుడు నవీద్ అక్రమ్ (24)గా పోలీసులు గుర్తించారు. ఇందులో ప్రధాన నిందితుడు సాజిద్ పోలీసుల కాల్పుల్లో మరణించాడు. నవీద్ గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
Australia terror attack | భారత పాస్‌పోర్టు ఉండటంతో..
సాజిద్ (Sajid) వద్ద భారత పాస్‌పోర్టు (Indian Passport) ఉన్నట్లు ఆసీస్ పోలీసులు గుర్తించారు. అతడు దానిని హైదరాబాద్ (Hyderabad)లో పొందినట్లు చెప్పారు. దీనిపై తాజాగా తెలంగాణ డీజీపీ (Telangana DGP) కార్యాలయం వివరాలు వెల్లడించింది. బాండీ బీచ్‌లో కాల్పులకు పాల్పడిన సాజిద్ హైదరాబాద్‌కు చెందిన వాడని తెలిపింది. అతడు 1998లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అనంతరం అక్కడే స్థిర పడి యూరోపియన్ సంతతికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు నవీద్, కుమార్తె ఉన్నారు. వీరు ఇద్దరు ఆస్ట్రేలియా పౌరులే. అయితే సాజిద్ భారత పాస్‌పోర్టునే వినియోగించేవాడు.
Australia terror attack | ఆరు సార్లు హైదరాబాద్‌కు..
నుంచి వలస వెళ్లిన తర్వాత సాజిద్ హైదరాబాద్‌కు తక్కువగా వచ్చాడు. నగరంలో అతడికి తక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆసీస్‌కు వలస వెళ్లిన తర్వాత ఆరు సార్లు మాత్రమే హైదరాబాద్ వచ్చాడు. ఉగ్రవాదులతో సాజిద్ సంబంధాలపై తమకు తెలియదని ఇక్కడి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా దాడికి ముందు నవంబర్‌లో తండ్రీకొడుకులు ఫిలిప్పీన్స్ వెళ్లారు. అక్కడ ఐసిస్ శిక్షణ తీసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారి వాహనంలో ఐఈడీలు, ఐఎస్ఐఎస్ జెండాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఐసీస్ ప్రేరేపిత ఉగ్రదాడికి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ప్రకటించారు.