Homeక్రీడలుWTC Final | ఈ సారి మ‌ళ్లీ క‌ప్ ఆసీస్ దే.. సౌతాఫ్రికాపై త‌గ్గుతున్న అంచ‌నాలు

WTC Final | ఈ సారి మ‌ళ్లీ క‌ప్ ఆసీస్ దే.. సౌతాఫ్రికాపై త‌గ్గుతున్న అంచ‌నాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:WTC Final | ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్-2025లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ‌ధ్య పోరు ర‌స‌వ‌త్త‌రంగానే సాగుతుంది.. ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియం(Lords Stadium)లో జరుగుతున్న ఈ సమరంలో తొలి రోజు అనూహ్యంగా 14 వికెట్లు నేలకూలాయి. పిచ్ నుంచి సీమ్, స్వింగ్‌కు మద్దతు లభించడంతో ఇరు జట్ల పేసర్లు చెలరేగి బౌలింగ్ చేశారు. ఆస్ట్రేలియాను 212 పరుగులకే కట్టడి చేశారు సఫారీ బౌలర్లు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ South Africa 138 పరుగులకు చుట్టేశారు. సఫారీ టాప్ ఆర్డర్ తడబడగా, ఆసీస్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. ఆట క్రమంగా ఊపందుకుంటూ చివరికి ఆసీస్ చేతుల్లోకి వ‌స్తున్న‌ట్టు క‌నిపిస్తుంది. ఒకవైపు బౌలర్లు వికెట్లు పడేస్తుంటే, మరోవైపు బ్యాటర్లు ప్రత్యర్థి మీద ఒత్తిడిని పెంచారు.

WTC Final | ఆసీస్ పై చేయి..

రెండో రోజు ఆట ముగిసే సమయానికి, ఆసీస్ 144/8 తో నిలిచింది. దీంతో స‌ఫారీల‌పై 218 పరుగుల లీడ్ సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 212 పరుగులకు కష్టపడినా, స్మిత్ (50), వెబ్‌స్టర్ (51) అర్ధశతకాలు జట్టు గౌరవాన్ని నిలబెట్టాయి. సౌతాఫ్రికా(South Africa) తరపున రబడ 5 వికెట్లతో సమరం మొదలుపెట్టాడు. అయితే కమిన్స్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గ‌లేదు. ప్యాట్ కమిన్స్ తన కెప్టెన్సీ స్టైల్‌తో పాటు బంతితో మేజిక్ చేశాడు. తన స్పెల్‌లో 6 వికెట్లు తీసి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను కేవలం 138 పరుగులకు చుట్టేశారు. సఫారీ టాప్ ఆర్డర్ తడబడగా, ఆసీస్ Australia మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది.రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్, మొదటి సెషన్‌లో దూకుడుగా ఆడింది. 27 ఓవర్లలో 78 పరుగులు చేసి కేవలం ఒకే ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. కానీ రెండో సెషన్‌లో మ్యాచ్ దిశే మారిపోయింది. మిడిల్ ఆర్డర్ పూర్తిగా తేలిపోయింది.

ఈ క్ర‌మంలో స్టార్క్ – కెరీ జోడీ కొంత స్థిరత్వాన్ని తీసుకొచ్చినా, చివరికి కెరీ ఎల్బీగా అవుట్ అయ్యాడు. స్టార్క్ మాత్రం మైదానంలో నిలబడి సౌతాఫ్రికాపై లీడ్‌ను 200 దాటి తీసుకెళ్లాడు. ఆట‌ ముగిసే సమయానికి, లయన్ స్టార్క్‌ Starc తో కలిసి క్రీజులో ఉన్నాడు. ఆట ముగిసే సమయానికి ఆసీస్ 144/8 తో నిలిచింది. దీంతో స‌ఫారీల‌పై 218 పరుగుల లీడ్ సాధించింది. మూడో రోజు ఎలాంటి ట్విస్ట్ ఉంటుందో చూడాలి. కానీ ఈ రోజు, ఆట అభిమానులకు మంచి థ్రిల్ ఇచ్చింది అనడంలో సందేహమే లేదు. అయితే సౌతాఫ్రికా బ్యాటింగ్ టైమ్‌లో ప్రొటీస్ పూర్తిగా రక్షణాత్మక ధోరణిలో ఆడింది. మార్క్రమ్, రికల్టన్, ముల్డర్, స్టబ్స్.. వీళ్లంతా అటాకింగ్ బ్యాటర్స్. కానీ ఒక్కరంటే ఒక్క బ్యాటర్ కూడా దూకుడుగా ఆడలేదు. కమిన్స్ అండ్ కో చెలరేగుతుండటంతో అతిగా డిఫెన్స్ చేయడానికి వెళ్లి భారీ మూల్యం చెల్లించుకున్నారు. కనీసం ఒక్క బ్యాటర్ అయినా అటాక్ చేసి ఉంటే మరో 30 నుంచి 40 పరుగులు స్కోరు బోర్డు మీదకు చేరేవి.