అక్షరటుడే, వెబ్డెస్క్: Australia bondi beach | ఆస్ట్రేలియాలోని Australia ప్రముఖ పర్యాటక ప్రాంతం బాండీ బీచ్ (Bondi Beach) ఆదివారం రక్తసిక్తమైంది. సాయుధులైన ఇద్దరు వ్యక్తులు కాల్పులకు తెగబడటంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. యూదు మతస్తులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అయితే, ఒక సాధారణ పౌరుడు చూపిన అపూర్వ ధైర్యం వల్ల మరింత భారీ ప్రాణనష్టం తప్పిందని స్థానిక అధికారులు వెల్లడించారు.
పర్యాటకులతో కిటకిటలాడే బాండీ బీచ్లో ఆదివారం సాయంత్రం సుమారు 6:40 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సెక్యూరిటీ దుస్తుల్లో ఇద్దరు సాయుధులు కారులో అక్కడికి చేరుకుని అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించారు. ఒక దుండగుడు చెట్టు దగ్గర నిలబడి కాల్పులు జరపగా, మరో వ్యక్తి బీచ్ పెవిలియన్ రోడ్డుపై నుంచి గన్ పేల్చాడు. ఊహించని ఈ దాడితో బీచ్లో ఉన్న పర్యాటకులు భయభ్రాంతులకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.
Australia bondi beach | ట్రూ ఫైటర్..
ఈ సమయంలో అక్కడ ‘హనుక్కాహ్’ అనే యూదు సంప్రదాయ పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు వచ్చినవారే ఎక్కువగా ఉన్నారని పోలీసులు తెలిపారు. వారినే లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ భయానక పరిస్థితుల్లో ఒక వ్యక్తి అసాధారణ సాహసం ప్రదర్శించాడు. కాల్పులు Firing జరుపుతున్న దుండగుడిని గమనించిన అతడు, అమాయకుల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో కార్ల మధ్యగా వెళ్లి దుండగుడిని వెనుక నుంచి అదిమి పట్టుకున్నాడు. అనంతరం అతడి చేతిలోని తుపాకీని లాక్కొని, గన్ అతడిపైనే ఎక్కుపెట్టడంతో దుండగుడు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు ఆ వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇంతలో మరో వ్యక్తి, మరికొందరు సహాయం చేయడంతో ఒక దుండగుడిని పట్టుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక దుండగుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో దాడికి పాల్పడిన వ్యక్తి కూడా మరణించాడు. మొత్తం ఘటనలో 16 మంది మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ఇద్దరు పోలీసులు గాయపడగా, 38 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై ఆస్ట్రేలియా Australia ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాండీ బీచ్లో భద్రతను మరింత కఠినతరం చేసినట్లు ప్రకటించింది. అమాయకుల ప్రాణాలను కాపాడేందుకు ప్రాణాలకే తెగించిన ఆ వ్యక్తిని “నిజమైన హీరో”గా పోలీసులు Police అభివర్ణించారు. ఈ దాడి వెనుక ఉన్న కారణాలు, కుట్ర కోణాన్ని దర్యాప్తు అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు.
BREAKING: Video shows the moment a civilian disarming a Bondi Beach shooter pic.twitter.com/0IbMIeNE5N
— Insider Paper (@TheInsiderPaper) December 14, 2025