Homeక్రీడలుAustralia WTC Final Squad | డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ కెప్టెన్‌గా క‌మ్మిన్స్.. ఇక్క‌డ ప‌రువు పోయింది,...

Australia WTC Final Squad | డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ కెప్టెన్‌గా క‌మ్మిన్స్.. ఇక్క‌డ ప‌రువు పోయింది, అక్క‌డ కాపాడుతాడా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Australia WTC Final Squad | ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ (world test championship (WTC) final) కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సారి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జ‌ట్ల (australia vs south africa teams) మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌ర‌గ‌నుంది. జూన్ 11వ తేదీన లార్డ్స్ వేదికగా ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా (defending champions australia).. దక్షిణాఫ్రికాతో (south africa) తలపడనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో (WTC final) అడుగుపెట్టడం దక్షిణాఫ్రికాకు ఇదే తొలిసారి కాగా వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అనుకుంటుంది స‌ఫారీ జ‌ట్టు. ఇప్ప‌టి వ‌ర‌కు ఐసీసీ టోర్నీ (ICC tournament) ఒక్క‌సారి కూడా అందుకోని సౌతాఫ్రికా ఈ సారి ఎలాగైనా ద‌క్కించుకోవాల‌నే క‌సితో ఉంది.

ఇక మ‌రి కొద్ది రోజుల‌లో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ (WTC final) జ‌ర‌గ‌నుండ‌గా, ఆస్ట్రేలియా తమ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. పాట్ కమిన్స్ సారథ్యంలో (pat cummins captain) కంగారూ జట్టు బ‌లంగా ఉంది వెన్ను గాయం కారణంగా కొంతకాలంగా ఆటకు దూరమైన కీలక ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (cameron green) జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ జట్టులో స్పిన్నర్ మాట్ కున్నెమాన్‌కు కూడా చోటు దక్కింది. ప్రధాన స్పిన్నర్ నాథన్ లియాన్‌కు (nathon lyon) అతడు బ్యాకప్‌గా ఉండే అవకాశం ఉంది. యువ ఆటగాడు శామ్ కాన్‌స్టాస్‌పై సెలక్టర్లు మరోసారి నమ్మకం ఉంచారు. జనవరిలో జరిగిన శ్రీలంక సిరీస్ (sri lanka series) నుంచి షెఫీల్డ్ షీల్డ్‌లో ఆడేందుకు అతడు మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఏదైనా అనుకోని గాయాలు సంభవిస్తే జట్టుతో కలిసేందుకు బ్రెండన్ డోగెట్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేశారు.

గత ఏడాది శ్రీలంక, భారత్‌లలో పర్యటించిన జట్టునే ఇప్పుడు కూడా కొనసాగించినట్టు కనిపిస్తోంది. ఐపీఎల్‌లో క‌మ్మిన్స్ నేతృత్వంలో స‌న్ రైజ‌ర్స్ (SRH captain pat cummins) దారుణంగా ప‌రాజయం పాలైంది. మ‌రి వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్‌లో (world test championship) అయిన క‌మ్మిన్స్ త‌న టీంతో క‌లిసి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడా అనేది చూడాలి.

Australia WTC Final Squad | డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా జట్టు :

పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాస్, మాట్ కున్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్