అక్షరటుడే, వెబ్‌డెస్క్: Australia Team | ఆస్ట్రేలియా జట్టు సిడ్నీ టెస్ట్‌లోను ఘన విజయం సాధించింది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో నాలుగు ఆసీస్ గెలవగా, కేవలం ఒకే ఒక్క టెస్ట్ ఇంగ్లండ్ సొంతమైంది. చివరి టెస్ట్‌లో ఆస్ట్రేలియా బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరచడంతో చివరి టెస్ట్ కూడా ఆసీస్ సొంతమైంది. ఇక ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఖవాజా (Khawaja) క్రికెట్‌కి గుడ్ బై చెప్పగా, అతనికి జట్టు ఘనమైన వీడ్కోలు పలికింది.
మరోవైపు టెస్ట్ క్రికెట్‌లో మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. యాషెస్ సిరీస్ (Ashes Series) చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ సాధించని రికార్డును బద్దలు కొడుతూ, ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 50కి పైగా పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసిన జట్టుగా ఆసీస్ నిలిచింది. దీంతో 134 ఏళ్లుగా కొనసాగుతున్న ఓ చారిత్రక రికార్డు తెరచాటుకు వెళ్లిపోయింది. 1892లో అడిలైడ్‌లో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ నమోదు చేసిన ఆరు 50+ భాగస్వామ్యాల రికార్డును ఇప్పుడు ఆస్ట్రేలియా అధిగమించింది. యాషెస్ 2025–26 సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో ఈ అద్భుత ఘట్టం నమోదైంది.
Australia Team | ఘోర పరాజయం..
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ పరంగా పూర్తిస్థాయి ఆధిపత్యం చెలాయిస్తూ 133.5 ఓవర్లలో 567 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు అందరూ బాధ్యతగా ఆడటంతో ఇంగ్లండ్ బౌలర్లకు ఏమాత్రం ఊరట దక్కలేదు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ దూకుడైన ఆటతో ఇంగ్లండ్‌పై విరుచుకుపడ్డాడు. 166 బంతుల్లో 24 ఫోర్లు, ఒక సిక్స్‌తో 163 పరుగులు చేసి మ్యాచ్‌కు టోన్ సెట్ చేశాడు. మరోవైపు కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Captain Steve Smith) నిలకడగా ఆడి 220 బంతుల్లో 138 పరుగులతో అజేయంగా నిలిచి ఇన్నింగ్స్‌కు బలం చేకూర్చాడు.ఈ ఇన్నింగ్స్‌లో ఆసీస్ మొత్తం ఏడు 50 ప్లస్ భాగస్వామ్యాలు నమోదు చేయడం విశేషం. తొలి వికెట్‌కు 57, రెండో వికెట్‌కు 105, మూడో వికెట్‌కు 72, నాలుగో వికెట్‌కు 54, ఐదో వికెట్‌కు 51, ఏడో వికెట్‌కు 71, ఎనిమిదో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యాలు నమోదయ్యాయి. యాషెస్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్‌లో ఇన్ని 50+ భాగస్వామ్యాలు రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ మ్యాచ్ ప్రత్యేకంగా నిలిచింది.
మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో భారీ లోటును ఎదుర్కొన్న ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 75 ఓవర్లలో 8 వికెట్లకు 302 పరుగులు చేయగా, ఆ తర్వాత 342 పరుగులకి ఆలౌట్ అయింది. హెడ్ (29), వెదర్‌లాండ్ (34), లబుషేన్ (37), గ్రీన్ (22) Green విలువైన పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో ఐదో టెస్ట్‌లో ఘన విజయం సాధించింది. ఇక ఇంగ్లండ్ బౌలర్స్ లో టంగ్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు.