అక్షరటుడే, హైదరాబాద్: Atukula Bathukamma | తెలంగాణ Telangana లో బతుకమ్మ Bathukamma సంబరాలు ప్రారంభమయ్యాయి.
మహాలయ అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఇక రెండో రోజు ‘అటుకుల బతుకమ్మ’ ఉంటుంది.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి Ashvayuja Shuddha Padyami రోజున వచ్చే ఈ వేడుకను మహిళలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటారు. బతుకమ్మ చుట్టూ ఆడిపాడిన తర్వాత అందరికి అటుకులు, బెల్లం పంచిపెడతారు.
ఈ నైవేద్యాన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. అటుకులనే నైవేద్యంగా సమర్పిస్తారు.. అందుకే ఈ రోజున పూల వేడుకను అటుకుల బతుకమ్మగా పేర్కొంటారు.
Atukula Bathukamma | పెందరాలే తలంటు స్నానం..
తెల్లవారు జామునే మహిళలు తలంటు స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుంటారు. అందంగా ముస్తాబయ్యాక.. తంగేడు, గునుగు, ఇతర పూలతో రెండు వరుసల్లో బతుకమ్మను ముచ్చటగా పేరుస్తారు.
తర్వాత గౌరమ్మను తయారుచేస్తారు. ఈ అటుకుల బతుకమ్మ వేడుకల్లో పెద్దలతోపాటు పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ రోజున మహిళలు వాయినాలు సైతం ఇచ్చిపుచ్చుకుంటారు.
Atukula Bathukamma | విద్యా సంస్థల్లో సంబరం..
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లోనూ ఘనంగా నిర్వహించుకుంటున్నారు.
విద్యార్థులు పూలతో బతుకమ్మను అందంగా పేర్చి, కోలాటాలు Kolatas, దాండియా Dandiya నృత్యాలతో ఉత్సహాభరితంగా సందడి చేస్తున్నారు. రంగురంగుల సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆకట్టుకున్నారు.