అక్షరటుడే, డిచ్పల్లి: Gurukula School | హాస్టళ్లలో ఆహార పదార్థాలు కలుషితం కాకుండా.. వాటి నిల్వపై శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సిబ్బందిని ఆదేశించారు. డిచ్పల్లి (Dichpally) మండలంలోని ధర్మారం(బి)లో (Dharmaram) మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను (Mahatma Jyotibapule BC Boys’ Gurukula School) ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ తదితర ప్రదేశాలను పరిశీలించారు. నిల్వ ఉంచిన సన్నబియ్యం, నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
Gurukula School | శుభ్రమైన వాతావరణంలోనే వంట చేయాలి
పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేయాలని నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు. మెనూ బోర్డును పరిశీలించి మెనూకు అనుగుణంగా భోజనం అందిస్తున్నారా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆహార పదార్థాలను భద్రపర్చే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేకంగా సిబ్బందికి సూచించారు.
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని, ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేక బోధన అందిస్తూ, మరింత మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి చేయాలన్నారు. అధ్యాపకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ సమయ పాలన పాటిస్తూ, అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. పర్యవేక్షణ అధికారి ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.