అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pavan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ఐక్యతను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడారు. మరో 15 ఏళ్లు కూటమి ఐక్యత కొనసాగాలని ఆయన పేర్కొన్నారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు చిన్న చిన్న విషయాల్లో సర్దుకు పోవాలని సూచించారు. కూటమి ఐక్యతను దెబ్బతీయడానికి వైసీపీ (YCP) నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. మనం ఐక్యంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
Pavan Kalyan | రవాణా మార్గాలు ప్రగతి చిహ్నాలు
దేశ ప్రగతికి రవాణా మార్గాలు చిహ్నమని పవన్ పేర్కొన్నారు. దేశం ఎదుగుదలకు అసలైన బలం మౌలిక వసతులని.. దీనికి కారణం కేంద్రమంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) అని ఆయన అన్నారు. దేశంలో 2014లో 91 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉంటే.. ఇప్పుడే. 1.40 లక్షల కిలోమీటర్లకు చేరిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అనేక నిధులు కేటాయిస్తుందని ఆయన తెలిపారు.
Pavan Kalyan | ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు
వైసీపీ హయాంలో కేంద్రం నుంచి సహకారం వచ్చినా.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం (Deputy CM) వెల్లడించారు. డోలీ మోతలు లేకుండా చేశామని ఆయన పేర్కొన్నారు. జగన్ హయాంలో రోడ్లు వేయలేదని, కనీసం గుంతలు పూడ్చలేదని మండిపడ్డారు.