135
అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | జ్యువెలరీ దుకాణంలో చోరీ యత్నం (robbery attempt) స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
నిజామాబాద్ నగరంలోని (Nizamabad city) మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జ్యువెలరీ షాప్ లో దుండగులు చోరీకి యత్నించారు. గునపాలతో దుకాణం షటర్ ను పైకి ఎత్తే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పోలీసులు అక్కడికి రావడంతో దొంగలు పారిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.