76
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Rice Mill | రైస్‌మిల్లు నుంచి బియ్యం చోరీ చేసేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ ఘటన ఖానాపూర్ (Khanapur) వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
Rice Mill | లారీల్లో నుంచి బియ్యం తీసుకెళ్లేందుకు..
ఖానాపూర్లోని ఓ రైస్‌మిల్ (rice mill) వద్ద బయట బియ్యం లారీలను నిలిపి ఉంచారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు రఫీక్, అబుబాకర్, ఫిరోజ్ రెండు ఆటోల్లో వచ్చారు. లారీల నుంచి బియ్యం చోరీ చేసేందుకు యత్నించారు. దీంతో అక్కడే కాపాలాగా ఉన్న వ్యక్తి గట్టిగా కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో చోరీకి యత్నించిన రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైస్‌మిల్ యజమాని శివలింగ ప్రసాద్ ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.