Homeజిల్లాలుకామారెడ్డిCourt judgment | బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడికి ఐదేళ్ల జైలు

Court judgment | బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడికి ఐదేళ్ల జైలు

బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం ఐదేళ్ల కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు కామారెడ్డి కోర్టులో న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Court judgment | బాలికపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ మేరకు గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ (Judge Varaprasad) ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. 2022 సెప్టెంబర్ 18న బిచ్కుంద (Bichkunda) మండలంలోని ఓ గ్రామంలో పాఠశాలలకు సెలవు ఉండడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను అదే గ్రామానికి చెందిన జల్దేవార్ శ్రీనివాస్ తన దగ్గరికి పిలిచి అత్యాచార యత్నం చేశాడు. దాంతో సదరు బాలిక గట్టిగా అరవగా ఇంటికి కాస్త దూరంలో ఉన్న బాలిక నానమ్మ వచ్చి తలుపులు బాదడంతో ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి పారిపోయాడు.

సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక జరిగిన విషయం చెప్పడంతో మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పొక్సో కేసు (POCSO case) నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు సాక్ష్యాలు సేకరించి కోర్టుకు సమర్పించగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వాటిని పరిశీలించి నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. కేసును విచారించిన నాటి బిచ్కుంద సీఐ శ్రీధర్ రెడ్డి (CI Sridher reddy), పీపీ శేషు, ప్రస్తుత సీఐ మోహన్ రెడ్డి, సిబ్బందిని ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.