183
అక్షరటుడే, గాంధారి: గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో (Mudelli village) జరిగిన దాడి ఘటనలో నిందితుడు నర్సింలుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఆంజనేయులు (Sub-Inspector Anjaneyulu) తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేసారు.
దాడి ఘటనలో ఎలాంటి పొలిటికల్ సంబంధాలు లేవని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి నిందితుడు నర్సింలు వరుసకు అల్లుడు అయిన రంజిత్ మధ్యం మద్యం సేవించిన సమయంలో మాటమాట పెరిగి గొడ్డలితో దాడి వరకు వెళ్లిందన్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దన్నారు. అనవసరమైన పుకార్లు సృష్టించవద్దని కోరారు. పుకార్లు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాయంత్రం లోపు పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.