అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Justice Gavai | సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై దాడికి యత్నం జరిగింది. కోర్టులో ఓ లాయర్ దాడికి యత్నించినట్లు సమాచారం. సోమవారం సుప్రీంకోర్టు(Supreme Court)లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓ న్యాయవాది వేదిక దగ్గరకు వెళ్లి షూను తీసి న్యాయమూర్తిపై విసిరేందుకు ప్రయత్నించాడు. అయితే, కోర్టులో ఉన్న భద్రతా సిబ్బంది సకాలంలో జోక్యం చేసుకుని న్యాయవాదిని బయటకు తీసుకెళ్లారు. సదరు లాయర్ బయటకు వెళ్తూ.. “సనాతన్ కా అప్మాన్ నహి సహేంగే” అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. షాక్ నుంచి తేరుకున్న న్యాయమూర్తి న్యాయవాదులను తమ వాదనలను కొనసాగించమని కోరారు.
Justice Gavai | దాడికి యత్నానికి కారణం అదేనా..!
ఖజురహోలో ఏడు అడుగుల తల నరికిన విష్ణు విగ్రహాన్ని పునరుద్ధరించడం గురించి గతంలో జరిగిన కేసులో జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలే ఈ సంఘటనకు కారణంగా తెలుస్తోంది. ఆ కేసును కొట్టివేసిన సమయంలో పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘ఖజురహో ఆలయం(Khajuraho Temple) భారత పురాస్తు విభాగం(ఏఎస్ఐ) పరిధిలో ఉంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు చేయడానికేమి లేదు. విగ్రహా పునర్మిణామంపై ఏఎస్‌ఐనే సంప్రదించండి. లేదంటే మీరెలాగూ విష్ణుమూర్తి(Lord Vishnu Statue)కి పరమభక్తుడిని అని అంటున్నారు కదా.. వెళ్లి ఆయననే వేడుకోండి. మీరు శైవత్వానికి వ్యతిరేకులు కాకపోతే అదే ఖజురహో ఆలయంలో శివలింగం ఉంది.. అక్కడ కూడా మీరు దేవుడిని విన్నవించుకోవచ్చు’ అంటూ సీజేఐ గవాయ్(CJI Gavai) వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన స్పందించి ‘తాను ఎవరినీ అగౌరవ పరచాలనే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయలేదు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను..’ అని ఆయన చెప్పిన విషయం తెలిసిందే.
1 comment
[…] ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై (Justice Gavai) బూట్‌తో దాడి చేసిన ఘటనపై తన వైఖరిని […]
Comments are closed.