HomeతెలంగాణMLA Sri Ganesh | ఎమ్మెల్యే శ్రీ గణేశ్​పై దాడికి యత్నం.. బోనాల సందర్భంగా ఘటన..!

MLA Sri Ganesh | ఎమ్మెల్యే శ్రీ గణేశ్​పై దాడికి యత్నం.. బోనాల సందర్భంగా ఘటన..!

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: MLA Sri Ganesh : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్​ (Secunderabad Cantonment MLA Shri Ganesh) పై దాడి యత్నం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఆయనపై దాడికి యత్నించారు. మాణికేశ్వర్ నగర్​లో ఆదివారం (జులై 20) బోనాల సందర్భంగా ఫలహారం బండి ఊరేగింపును ఎమ్మెల్యే శ్రీ గణేశ్​ బయలుదేరారు.

ఈ క్రమంలో 20 మంది గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే వాహనంపై దాడికి దిగారు. ఈ ఘటనపై ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) పోలీస్ స్టేషన్​లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.

పెద్ద మొత్తంలో వాహనాలను అడ్డుగా నిలిపి, తన కాన్వాయ్​ను అడ్డుకున్నారని ఎమ్మెల్యే శ్రీ గణేశ్​ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన గన్​మెన్ దగ్గర ఉన్న తుపాకీని సైతం లాక్కునేందుకు దుండగులు ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు.

MLA Sri Ganesh : ఉప ఎన్నికలో గెలుపు..

2023లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా కంటోన్మెంట్ నుంచి భారాస (BRS) అభ్యర్థిగా లాస్య నందిత Lasya Nandita పోటీ చేసి గెలిచారు. కాగా.. ఫిబ్రవరి, 2024లో జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించారు. ఈ క్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

అలా కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 2024లో ఉప ఎన్నిక జరిగింది. భారాస నుంచి దివంగత సాయన్న చిన్న కూతురు నివేదిత, కాంగ్రెస్ (Congress) నుంచి శ్రీ గణేశ్​, భాజపా(BJP) నుంచి వంశ తిలక్ పోటీలో నిలిచారు. కాగా.. తన సమీప ప్రత్యర్థి, భారాస​ అభ్యర్థి నివేదితపై 13 వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేశ్​ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Must Read
Related News