అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collectorate | తన భూ సమస్యను (land issue) పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓ మహిళ సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్‌కు వచ్చింది. తన వెంట గడ్డి మందు తీసుకుని వచ్చింది. ఈ క్రమంలో గడ్డి మందు తాగేందుకు డబ్బాను బ్యాగులో నుంచి బయటకు తీసింది. గమనించిన సెక్యురిటీ సిబ్బంది ఆమె గడ్డి మందు తాగకుండా అడ్డుకున్నారు. రూరల్ ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు.
Nizamabad Collectorate | అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ..
సాలూర మండలం సలంపాడ్కు చెందిన బాధితురాలు జయమ్మ మాట్లాడుతూ తనకు రెండెకరాల పొలం, ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపింది. అయితే తన పొలంలోని అర ఎకరం భూమిని తనకు తెలియకుండా చిన్న కుమారుడు విక్రయించాడని వివరించింది. పొలానికి సంబంధించిన పూర్తి పత్రాలు తన వద్దని ఉన్నాయని తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ (police station), తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా పరిష్కారం కావడం లేదని చెప్పారు. దీంతో మనస్థాపంతో ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు ఆమె చెప్పింది.