అక్షరటుడే, వెబ్డెస్క్: Mallu Ravi | నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress government) కూల్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ మూడు పార్టీలు కలిసి మహా కూటమిగా ఏర్పడి ప్రజల ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నాయన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారన్నారు. కొందరు నాయకులు పగటి కలలు కంటూ.. తప్పుడు ప్రచారాలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు.
