అక్షరటుడే నిజామాబాద్ సిటీ: PMP RMP Association | జిల్లాలో మెడికల్ కౌన్సిల్ చేపడుతున్న దాడులను వెంటనే ఆపాలని పీఎంపీలు ఆర్ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా పాత కలెక్టరేట్ వరకు సాగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తమపై స్టేట్ మెడికల్ కౌన్సిల్ పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి (Late CM Rajasekhar Reddy) హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) గ్రామీణ వైద్యులకు పారా మెడికల్ శిక్షణ (Paramedical training) ఇచ్చారని వివరించారు. శిక్షణ పూర్తయిన గ్రామీణ వైద్యులకు సర్టిఫికెట్లు ఇచ్చి తమను గుర్తించాలని వారు కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్, బోధన్, ఆర్మూర్ డివిజన్ల అధ్యక్షులు రాజగోపాల్ చారి, సాయిలు, సంఘం ప్రతినిధులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.