అక్షరటుడే, న్యూఢిల్లీ: Operation Sindoor | ఆపరేషన్ సింధూర్.. ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న మాట. ఎప్పుడూ శాంతిని జపించే భారత్.. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా దాయాది దేశం పాకిస్తాన్‌పై india pak war విరుచుకుపడింది. తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదాలను మట్టుబెట్టింది.
కాగా, ఈ క్రమంలో పాక్ కూడా ప్రతిదాడికి దిగే అవకాశం ఉండటంతో భారత్ అప్రమత్తమైంది. దేశంలోని 9 ఎయిర్‌పోర్ట్‌లు మూసివేసింది. ధర్మశాల, లే, జమ్మూ, శ్రీనగర్, అమృతసర్‌తో సహా కీలక విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను రద్దు చేసింది. 9 నగరాలకు విమానాల రాకపోకలను ఎయిరిండియా రద్దు చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.
