అక్షరటుడే, న్యూఢిల్లీ: Balochistan : ఓ వైపు పాక్పై భారత్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో పాకిస్తాన్ సైనిక స్థావరాలపై వరుస దాడులు చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్ సైన్యం ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టారు. పెద్ద ఎత్తున కాల్పులు, పేలుళ్లు సంభవించాయి.
