అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | కత్తితో దాడిచేసిన వ్యక్తిని రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పాత కక్షలను మనసులో పెట్టుకుని బోధన్ రోడ్డులోని (Bodhan Road) ఓ హోటల్ వద్ద దోమల సాయికుమార్ అనే వ్యక్తిని కన్నిగిడె సాయికుమార్ చాకుతో హత్యాయత్నం చేశాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కన్నిగిడె సాయికుమార్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
