అక్షరటుడే, హైదరాబాద్: attacked DCP | గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలోని చాదర్ ఘాట్ (Chadar Ghat) లో కాల్పుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఈ నేపథ్యంలో కాల్పులు జరిగిన విక్టోరియా ప్లే గ్రౌండ్‌కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (CP) సజ్జనార్ CP Sajjanar చేరుకున్నారు. సీపీతో పాటు క్లూస్ టీం అక్కడికి చేరుకుని, ఆధారాలను సేకరించింది.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతామని సీపీ హెచ్చరించారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు చాదర్ ఘాట్ విక్టోరియా మైదానం వద్ద కాల్పులు జరిగినట్లు సజ్జనార్ తెలిపారు.
attacked DCP | నిందితుడిపై 20కి పైగా కేసులు..
ఇద్దరు రౌడీ షీటర్లు స్నాచింగ్ చేస్తుండగా డీసీపీ చైతన్య వారిని పట్టుకునే ప్రయత్నం చేశారని సీపీ తెలిపారు. డీసీపీపై దాడి చేసిన రౌడీ షీటర్ పేరు మహమ్మద్ ఉమర్ అన్సారీ అని పేర్కొన్నారు.
అన్సారీ Mohammed Umar Ansari పై ఇప్పటికే 20కి పైగా కేసులు ఉన్నాయన్నారు. వీటిల్లో రెండు పీడీ యాక్టులు ఉన్నాయన్నారు. నిందితుడు రెండేళ్లు జైలులో ఉన్నట్లు సీపీ తెలిపారు.
దొంగను ఛేజ్ చేస్తూ పట్టుకునేందుకు డీసీపీ DCP Chaitanya తన గన్‌మన్‌తో వెళ్లినట్లు సీపీ తెలిపారు. కాగా, గన్‌మన్‌పై నిందితుడు కత్తితో దాడి చేసినట్లు వెల్లడించారు. దీంతో ఆత్మరక్షణ కోసం డీసీపీ చైతన్య దొంగపై రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు వివరించారు.
కాల్పుల వల్ల మహమ్మద్ ఉమర్ అన్సారీ చేతిపై, కడుపులో గాయాలైనట్లు చెప్పారు. నిందితుడిని మలక్‌పేట యశోద ఆసుపత్రి (Malakpet Yashoda Hospital) కి తరలించినట్లు సీపీ తెలిపారు.
అస్వస్థతకు గురైన డీసీపీ, గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సీపీ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామన్నారు. పారిపోయిన మరో దొంగ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
