అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Drunk and Drive | నగరంలోని రైల్వే కమాన్ వద్ద ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. ఏకంగా ట్రాఫిక్ పోలీసు (Traffic Police)లపై దాడి చేశాడు.
Drunk and Drive | రైల్వేకమాన్ వద్ద..
మూడో టౌన్ ఎస్సై నారాయణ (TheeTown SI Narayana) తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రైల్వేకమాన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆర్మూర్ నుంచి నిజామాబాద్ (Nizamabad)కు నగరంలోని న్యాల్కల్ రోడ్ ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్ పిట్ల సాయిలు కారులో వస్తుండగా పోలీసులు ఆపి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేశారు. ఈ క్రమంలో సాయిలు పోలీసులకు వాగ్వాదానికి దిగారు. అనంతరం ట్రాఫిక్ సీఐ (Traffic CI), ఎస్సైలపై దాడికి పాల్పడ్డాడు.
Drunk and Drive | రిమాండ్‌కు తరలింపు..
మద్యం అతిగా తాగినట్లు టెస్ట్‌లో నిర్దారణ చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఆర్ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ (RSI Srinivas Goud) ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సాయిలును రిమాండ్‌కు తరలించినట్లు మూడోటౌన్ ఎస్సై నారాయణ తెలిపారు.