అక్షరటుడే, భీమ్గల్: Gram Panchayat Officer | విధి నిర్వహణలో ఉన్న జీపీవో, రెవెన్యూ సిబ్బందిపై (GPO and Revenue staff) దాడి చేయడం హేయనీయమని జీపీవో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంగెం పృథ్వీరాజ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
Gram Panchayat Officer | గూడూరు మండల కేంద్రంలో..
గూడూరులోని ప్రభుత్వ భూమిని (government land) కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారన్న సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జీపీవో షేక్ అబ్బాస్ తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. భూమిని స్వాధీనం చేసుకునే క్రమంలో కబ్జాదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు.
కఠిన చర్యలు తీసుకోవాలి..
ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్న అధికారులకు రక్షణ లేకుండా పోయిందని పృథ్వీరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే.. చట్టపరంగా కఠినచర్యలు తీసుకోవాలని, వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు.