అక్షరటుడే, భీమ్గల్ : Attack on police vehicle | వినాయక నిమజ్జన (Ganesh Immersion) శోభాయాత్రలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసుల వాహనంపై కొందరు యువకులు దాడి చేశారు.
ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో చోటుచేసుకుంది. జిల్లాలో వినాయక నిమజ్జనం శనివారం ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
బడా భీమ్గల్ గ్రామంలో శనివారం నిమజ్జన శోభాయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో బందోబస్తు చేపట్టడానికి పోలీసులు వచ్చారు. కాగా, వారి వాహనంపై ఆకతాయిలు ఆదివారం తెల్లవారుజామున దాడి చేశారు.
Attack on police vehicle | త్వరగా వెళ్లమని చెప్పడంతో..
గ్రామంలో శనివారం మొదలైన వినాయకుడి శోభాయాత్ర ఆదివారం తెల్లవారుజామున వరకు కొనసాగింది. దీంతో మండపాల నిర్వాహకులను పోలీసులు మందలించారు. వెంటనే వెళ్లిపోవాలని సూచించారు.
దీంతో కొందరు యువకులు వాహనం police vehicle వెనుక నుంచి రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పోలీసు వాహనం వెనుక అద్దం పగిలిపోయింది.
దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులకు, యువకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.
ఈ విషయమై ఎస్సై సందీప్ (SI Sandeep)ను వివరణ కోరగా.. రాళ్లతో దాడి చేసి పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారని చెప్పారు.
తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడి చేసిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.