Homeక్రైంTaskforce Police | పేకాట స్థావరంపై దాడి.. భారీగా నగదు పట్టివేత

Taskforce Police | పేకాట స్థావరంపై దాడి.. భారీగా నగదు పట్టివేత

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Taskforce Police | పేకాట స్థావరంపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు (Taskforce Police) దాడి చేశారు. పలువురిని అరెస్టు చేసి, భారీగా నగదు సీజ్ చేశారు.

నిజామాబాదు రూరల్ పోలీస్ స్టేషన్ (Nizamabad Rural PS) పరిధిలోని గొల్లగుట్ట గ్రామ అటవీ ప్రాంతంలో పేకాడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. పేకాడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు సెల్​ఫోన్లు, రూ.1,02,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం జుదారులను నిజామాబాద్​ రూరల్​ పోలీసులకు అప్పగించారు. టాస్క్​ఫోర్స్ ఇన్​స్పెక్టర్​ అంజయ్య, ఎస్సై గోవింద్, సిబ్బంది పాల్గొన్నారు.

Must Read
Related News