Homeజిల్లాలునిజామాబాద్​CCS Police | పేకాట స్థావరంపై దాడి

CCS Police | పేకాట స్థావరంపై దాడి

CCS Police | నిజామాబాద్​ రూరల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని పేకాట స్థావరంపై సీసీఎస్​ పోలీసులు దాడులు చేపట్టారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CCS Police | నగర శివారులోని పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. పలువురిని అరెస్ట్ చేశారు.

సీసీఎస్ (CCS)​ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో గురువారం రాత్రి రూరల్ పోలీస్ స్టేషన్ (Rural Police Station) పరిధిలోని గంగస్థాన్ -1 లక్ష్మి నరసింహ అపార్ట్​మెంట్​లో దాడులు చేపట్టారు. అక్కడ పేకాడుతున్నారనే సమాచారం మేరకు రైడ్​ చేశారు. పేకాడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9 ఫోన్లు, రూ.49,250 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తదుపరి చర్య నిమిత్తం రూరల్ పోలీస్ స్టేషన్​లో అప్పగించారు. సీసీఎస్​ సీఐలు సురేష్, సాయినాథ్, ఎస్సై గోవింద్, సిబ్బంది పాల్గొన్నారు.