అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో (joint Nizamabad district) పేకాట జోరుగా సాగుతోంది. పలుమార్లు పోలీసులు పేకాడుతున్న వారిని పట్టుకుంటున్నా.. జూదం ఆగడం లేదు. తాజాగా ఎల్లారెడ్డి మండలంలో (Yellareddy Mandal) పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్లపేట శివారులో జూదం ఆడుతున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు దాడులు (Police Raids) నిర్వహించారు. ఈ దాడిలో 14 మంది వ్యక్తులు జూదం ఆడుతున్నట్లు గుర్తించారు. పోలీసులను గమనించి నలుగురు పరారయ్యారు. మిగిలిన 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి 10 మొబైల్ ఫోన్లు, 11 మోటార్ సైకిళ్లు, రూ.43,150 స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎల్లారెడ్డి ఎస్సై మహేష్ (Yellareddy SI Mahesh) తెలిపారు. మండలంలో ఎవరైనా చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.