అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై (Chief Justice BR Gavai) దాడి న్యాయ వ్యవస్థ, భారత రాజ్యాంగంపై దాడి అని, దీనిన్ని యావత్ సమాజం తీవ్రంగా ఖండించాలని ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంథని సామ్యెల్ మాదిగ అన్నారు.
ఈ మేరకు శుక్రవారం ఎల్లారెడ్డిలోని (Yellareddy) అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజేఐపై దాడి ఘటనపై పూర్తి విచారణ జరగాలని, అసలు బాధ్యులను గుర్తించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎమ్మార్పీఎస్ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో పది రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంతి పద్మారావు మాదిగ, మండల అధ్యక్షుడు శివానందం మాదిగ, లక్ష్మి, సాయిలు, గంగారాం, సాయిలు, సాయివరుణ్, సామేల్, తదితరులు పాల్గొన్నారు.