HomeUncategorizedBhadrachalam Temple | భద్రాచలం ఆలయ ఈవోపై దాడి

Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ ఈవోపై దాడి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhadrachalam Temple | దేవుడి భూములకు రక్షణ లేకుండా పోయింది. కొందరు ఆలయ భూములను యథేచ్ఛగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. అడ్డుకోవడానికి వెళ్తున్న అధికారులపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా భద్రాచలం ఈవో రమాదేవి(Bhadrachalam EO Ramadevi)పై కొందరు దాడి చేశారు.

ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh)​లోని అల్లూరి జిల్లా పురుషోత్తపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పురుషోత్తపట్నంలో భద్రాచలం రామాలయానికి సంబంధించిన 889.5 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని కొందరు ఆక్రమించారు. ఈ వ్యవహారం కోర్టుకు కూడా వెళ్లింది. ఆ భూములను దేవస్థానానికి అప్పగించాలని ఇటీవల ఏపీ హైకోర్టు(High Court) తీర్పు చెప్పింది. అయినా ఆక్రమణదారులు మాత్రం నిర్మాణాలు చేపట్టారు.

Bhadrachalam Temple | మూకుమ్మడిగా దాడి

పురుషోత్తపట్నం(Purushottapatnam)లోని ఆలయ భూముల్లో నిర్మాణాల విషయం తెలుసుకున్న ఈవో రమాదేవి, సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. నిర్మాణాలను అడ్డుకునే యత్నం చేశారు. అయితే స్థానికులు ఈవోతో పాటు సిబ్బందిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో ఈవో స్పృహ తప్పి పోడిపోయారు. దీంతో సిబ్బంది వెంటనే భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.